logo

జగిత్యాల జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.


20-Sep-2019 17:50IST
road accident at jagithyala

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచ్ పెల్లి గ్రామ సమీపంలో ప్రధాన జాతీయ రహదారిపై కారు ఆటో ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.కొందరి పరిస్థితి  విషమంగా ఉంది. ప్రమాద ఘటన ను పరిశీలిస్తే అతివేగంతో ఆటోను కారు ఢీకొన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు అటుగా వెళ్లే వాహన దారులు సహాయక చర్యలు చేపట్టారు.
Image result for accident
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సమయానికి అంబులెన్సు రాకపోవటంతో  క్షతగాత్రులు గాయాలతో ఆర్తనాదాలు చేశారు.అనంతరంప్రమాద ఘటనను తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని  గాయపడిన వారిని  వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.ప్రమాదానికి గల కారణాలు,గాయపడిన వారి పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది. 

Tags: jagithyala road accident telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top