logo

ఆమె రక్తవర్ణం నీలం..!


20-Sep-2019 19:36IST
women blood changed into blue colour

రక్తం యొక్క సహజ రంగు ఎరుపు. అది మనిషిలోనూ అదే రంగులో ఉంటుంది, ఇతరత్రా ప్రాణుల్లో కూడా అదే రంగులో ఉంటుంది. అలాంటిది ఒక మహిళ రక్తం రంగు, కొన్ని మందులు వికటించడం కారణంగా నీలం రంగులోకి మారిపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, పంటి నొప్పి నివారణ కోసం ఓ మందును తీసుకుంది. అది కాస్తా వికటించడంతో ఆమె శరీర వర్ణంతో పాటు ఆమె రక్తం, గోళ్లు  నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో ఆందోళన చెందిన ఆమె డాక్టర్ను సంప్రదించగా...డాక్టర్ ఆమెను పరీక్షించి, ఆమె ఎదుర్కొంటున్న సమస్యను వైద్య పరిభాషలో సైనోటిక్ అని అంటరాని తెలిపారు.       

రక్తంలో అధిక స్థాయిలో మెదిమెగ్లోబిన్ ఉత్పత్తి కావడం చేత ఆ మహిళకు ఈ పరిస్థితి ఏర్పడిందని... దీనిని మెదిమెగ్లోబినీమియా అని అంటరాని డాక్టర్ పేర్కొన్నారు. ఈ కారణం చేత హిమోగ్లోబిన్ ప్రాణవాయువును తీసుకెళ్లినా కణజాల్లోకి ప్రభావవంతంగా విడుదల చేయలేదు. దీంతో చర్మం, రక్తం నీలం రంగులోకి మారిపోయాయని ఆయన అన్నారు. 

ఆమె సమస్యకు మిథిలిన్ బ్లూ అనే యాంటీ డాట్ తో చికిత్స నందిస్తున్నట్టు,  దాని వల్ల ఆమె క్రమక్రమంగా కోలుకొని తన సహజ రంగు పొందనునట్టు డాక్టర్ తెలిపారు. నొప్పి నివారణ మందులు బెంజో కైన్ ఉపయోగించేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఇలాంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు.   

Tags: women medhimeglobineemia cinotik benjo kine

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top