logo

ఈసీ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు


15-May-2019 15:15IST
kalaventraoap

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై ధ్వ‌జ‌మేత్తారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు. ఎన్నిక‌ల సంఘం పారద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు.  అడిష‌న‌ల్ సీఈవో అధికారిని సుజాత శ‌ర్మను క‌లిశారు క‌ళా మెంట్రావు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నిక‌ల స‌మాయంలో రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలీంగ్ బుత్ల్లో  అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఫిర్యాదు చేశామ‌న్నారు. అవ‌క‌త‌వ‌క‌లు జరిగిన పొలింగ్ కేంద్రాల్లో రీపోలీంగ్ జ‌ర‌పాల‌ని ఆయ‌న కోరారు. పోలీంగ్ రోజున ఆరెండు బూత్ ల‌లో టీడీపీ నేత నాని ఇచ్చిన ఫిర్యాదు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని 166,310నెంబ‌రు బూతుల‌పై సీఈవో విచార‌ణ‌కు ఎందుకు ఆదేశించార‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌లు ముగిశాయి అనంత‌రం రీపోలీంగ్ కూడా ముగిసింది ఇప్ప‌డు విచార‌ణ చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈసీకి నిజంగా చిత్త‌శుద్ధిని శంకించాల్సీ వ‌స్తోంద‌ని క‌ళా వెంక‌ట్రావు వ్యాఖ్యానించారు. ఫిర్యాదు పై స్పంధించిన అడిష‌న‌ల్ సీఈవో అధికారిని సుజాత శ‌ర్మ,, సీఈవో గోపాల‌కృష్ణ ద్వివేది సెల‌వుపై వెళ్లారని తిరిగి వ‌చ్చాక ఫిర్యాదుపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 

 

Tags: amaravathi kalavenkatrao ec

Advertisement
Advertisement
Top