logo

తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ


22-Sep-2019 16:37IST
akbaruddin owaisi appointed as TPAC chairmen

తెలంగాణ అసెంబ్లీలో పలు కమిటీల నియామకం ఆదివారం నాడు జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ నియామకం జరిగింది.  పీఏసీ చైర్మన్‌ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీకి చెందిన వారికి ఈ పదవిని అప్పజెప్పడం ఆనవాయితీ. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన విషయం తెలిసిందే. 

దాంతో ఏడుగురు ఎమ్మెల్యేలున్న ఎంఐఎం ప్రతిపక్ష హోదాను దక్కించుకోవటంతో, అక్బరుద్దీన్ ఒవైసీని ఈ పదవి వరించింది. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మెన్ గా అక్బరుద్దీన్ నియామకంతో పాటు అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌ గా... ఆశన్నగారి జీవన్ రెడ్డిని, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్‌గా... సొలిపేట రామలింగా రెడ్డిని, రైల్వే జోనల్ కమిటీ మెంబర్‌గా... నన్నపనేని నరేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags: TPAC chairmen akbaruddin owaisi undertaking comittee estimate comitte railway zonal comitte

Advertisement
Advertisement
Top