logo

జూలై చివరి నుంచే గోదావరి జలాల ఎత్తిపోత


17-May-2019 11:52IST
cm kcr holds review meeting

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ జూలై చివరినుంచే గోదావరి జలాలను ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పారు. నీటి ప్రవాహం ఉండే ఆరునెలల్లో రోజుకు 24 గంటలపాటు నిర్విరామంగా నీటిని ఎత్తిపోయాలని అన్నారు. మొత్తంగా ఏటా దాదాపు 540 టీఎంసీల నుంచి 600 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయాలని, 45 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంపుల ట్రయల్ రన్లు కూడా విజయవంతమయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయాలి. ఇందుకు 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. గోదావరిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్దే ఉన్నది. కాబ ట్టి మేడిగడ్డ నుంచి మరో టీఎంసీని కూడా ఎత్తిపోయాలి. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టుచేస్తాం. ఇందుకు 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది. గోదావరిలో నీటిప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుంది. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున, జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టీఎంసీల చొప్పున నీరు లిఫ్టు చేయవచ్చు. డిసెంబర్‌లో కూడా ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు? దీనికి ఎంత కరంటు అవసరం పడుతుందో శాస్త్రీయంగా అంచనావేయాలి. ఈ సమయం లో సరిపడినంత విద్యుత్ సరఫరాకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు.  

Tags: CM KCR Kaleshwaram Project Pragathi Bhavan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top