logo

రౌడీయిజం జగన్ రక్తంలోనే ఉంది ..!


25-Sep-2019 16:41IST
ayyanna patrudu comments on ys jagan

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారై పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మాజీ మంత్రి సీనియర్  నేత అయ్యన్నపాత్రుడు అధికార ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో జరిగిన టిడిపి విస్త్తత స్ధాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే నెల 10,11 తేదీల్లో చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్న తరుణం లో పలు కీలక అంశాలపై టీడీపీ నేతలు చర్చించారు. ఈ సందర్బంగా అయ్యన పాత్రుడు మాట్లాడుతూ జగన్ పాలన అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అన్నారు. 
Image result for ayyanna patrudu, ap cm ys jagan , ysrcp
రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్ కు తన బ్లడ్ లోనే రౌడీయిజం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలన లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిందని పేర్కొన్నారు. నర్సీపట్నంలో ప్రజలకోసం చేసిన పోరాటంపై తనపై నమోదైన పాతకేసులు తవ్వి రాజకీయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ పోస్టులకు ఎందుకు పరీక్షపెట్టారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: ayyanna patrudu ap cm ys jagan ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top