logo

టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు


26-Sep-2019 19:52IST
ap government sensational decision on ssc exams

పదో తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం తెరతీసింది. ఇక నుండి జరగనున్న టెన్త్ పరీక్షల్లోని  ప్రశ్నపత్రం స్వరూపం మారబోతోంది. ఇందుకు గాను టెన్త్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులను తొలగించారు. అంతే కాకుండా ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ఇకపై ప్రశ్నాపత్రంలోనే బిట్ పేపర్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అలాగే పరీక్షల్లో విద్యార్థులకు అదనంగా  ప్రశ్న పత్రాన్ని చదువుకుండేందుకు ఉపయోగపడేలా 15 నిమిషాల వ్యవధి ఇస్తామన్నారు. 

ఈ నేపథ్యంలో ఇంటర్నల్ అసైన్ మెంట్ మార్కులు కార్పొరేట్ స్కూళ్లకు వరంగా మారాయని మంత్రి ఆరోపించారు. 45వేల 390 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటయ్యాయని, కమిటీ సభ్యులకు త్వరలో ట్రైనింగ్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఇంకా 927 స్కూళ్లలో కమిటీలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. విద్యా హక్కు చట్టం అమలు, ఫీజుల నియంత్రణపై కమిటీలు పర్యవేక్షిస్తాయని మంత్రి వివరించారు. అలాగే ఆన్సర్ షీట్‌ను కూడా నాణ్యంగా తయారు చేస్తామని.. టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీని అరికట్టేందుకు చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. 




Related image

Tags: ap government sensational decision ssc exams

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top