logo

ఇలాంటి టీచర్ ను బహుశా ఎవరూ చూసిండకపోవచ్చు..!


28-Sep-2019 09:50IST
lady professor with students baby on her back for 3 hours giving lecture

జార్జియాలోని ఓ మెడికల్ కాలేజీలో డాక్టర్ రమ్తా సిస్కో సిస్సే అనే మహిళ, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె అనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్టులు డీల్ చేస్తోంది. కాగా, సిస్సే తన క్లాస్ లోని ఒక విద్యార్థిని చంటిబిడ్డను, ల్యాప్‌లో కూర్చొబెట్టుకుని మూడు గంటల పాటు పాఠాలు చెప్పడం...ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే... ఓ వైద్య విద్యార్థినికి ఏడాది వయసున్న బాలుడు ఉన్నాడు. తన బాబు ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో.. ఆ విద్యార్థిని క్లాసులకు హాజరు కాలేకపోతోంది. పరీక్షలు దగ్గర పడుతుండటంతో, ఎలాగైనా క్లాసులకు హాజరుకావాలని భావించిన ఆ విద్యార్థిని...తన బాబును తరగతి గదిలోకి తీసుకురావొచ్చా? అంటూ ప్రొఫెసరమ్మను అడిగింది. 
ప్రతిభావంతురాలైన ఆ విద్యార్థినికి తపనను ఎరిగిన ఆ ప్రొఫెసరమ్మ, తన బిడ్డను క్లాస్ రూమ్ లోకి అనుమతిచ్చింది. అయితే చంటిబిడ్డను తన వద్ద కూర్చోబెట్టుకుని నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థిని చూసి... సదరు ప్రొఫెసరమ్మ, ఆ చంటాడిని తీసుకుని వీపు వెనుక భాగంలో ల్యాప్‌లో కూర్చొబెట్టుకుని మూడు గంటల పాటు పాఠాలు బోధించింది. 

ఈ దృశ్యాలను లెక్చరర్ కుమార్తె అన్నాదోతే.. తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. విద్యార్థిని బిడ్డను ఎత్తుకొని మరీ పాఠాలు చెబుతున్న, తన తల్లిని చూస్తే తనకు గర్వంగా ఉందని... కాప్షన్ పెట్టి పోస్ట్ చేసిన ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ప్రొఫెసరమ్మపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 

Tags: lady assistant professor 3hours students baby lecture

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top