logo

తన సత్తా చాటుకున్న కేఎల్ రాహుల్


28-Sep-2019 14:52IST
It was kl rahul who made his claim

ఇటీవలే జరిగిన విండీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబరచడంలో కేఎల్ రాహుల్ విఫలమైన కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ పేలన ప్రదర్శన కనబరచడంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫీలో చెలరేగిపోయాడు మన టీమిండియా యువ ఆటగాడు కేఎల్ రాహుల్. విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీ సాధించి విండీస్ పర్యటనలో తనను విమర్శించిన వారి నోర్లను మూయించాడు. 

విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన




ఈ నేపథ్యంలో టోర్నీలో కర్ణాటక జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ శనివారం చిన్నస్వామి స్టేడియంలో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లోఈ ఘనతను సాధించాడు.మొత్తం 122 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో శతకం సాధించాడు. లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కేఎమ్ ఆఫిస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే సైతం అద్భుత ప్రదర్శనతో అలరించడంతో ఆట రసవత్తరంగా మారింది. 



Century for @klrahul11 ... his 6th in Lista A matches... slow off the blocks and then he got going @TOIBengaluru

Embedded video

Tags: kl rahul century vijay hajaare trophy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top