logo

అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం.


29-Sep-2019 08:07IST
grama sachivalaya jobs are started from october 2nd

ఏపీ నూతన ప్రభుత్వం అక్టోబర్ నుంచి 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థను అట్టహాసంగా ప్రారంభించనుంది. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించి రాష్ట్ర అభివృద్ధిలో నూతన ఒరవడిని సృష్టించబోతోంది. ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం,అభ్యర్థులకు నియామక పత్రాలు అందించటం వంటి పనులన్ని చకచకా జరిగిపోతున్నాయి.
Image result for ap grama sachivalayam
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్దమైపోతోంది. రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎల్లుండి విజయవాడ నియామక పత్రాలు అందజేయనున్నారు. అన్నిజిల్లాల్లో ఇంచార్జ్ మంత్రులు నూతనంగా ఎన్నికైన ఉద్యోగులకు అప్పోయింట్మెంట్ లెటర్లు అందించనున్నారు. విజయవాడ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. వచ్చే బుధవారం తూర్పు గోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు.

Tags: grama sachivalaya jobs october 2nd

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top