logo

రూ.23 కోట్లు చేపను పట్టుకొని సముద్రంలో వదిలేశాడు ..!


29-Sep-2019 10:06IST
23 crores worth fish caught by a man

ఐర్లాండ్‌ తీరంలో ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప వెస్ట్ కార్క్‌కి చెందిన డేవ్ ఎడ్వార్డ్స్ వలకు చిక్కింది. ఆ చేప బరువు 270 కిలోలు. మార్కెట్‌లో ధర రూ. 23 కోట్ల పైమాటే ఉంది. కానీ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ చేపను సముద్రంలో వదిలేశాడు. అయితే డేవ్ ఎడ్వార్డ్స్ చేపలు పట్టే ఉద్దేశంతో వలలు వెయ్యలేదని. తాము సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం ఉద్దేశం కాదని చెప్పాడు. 
Image result for tuna fish
వారు ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి వదిలేస్తున్నామని డేవ్ ఎడ్వార్డ్స్ చెప్పాడు. అయితే ఆ భారీ ట్యూనా చేప వలకు చిక్కిన ఫోటోని తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అంత పెద్ద చేపను నీళ్ళల్లో వదిలేయడంతో నెటిజన్లంతా డేవ్ ఎడ్వార్డ్స్ ఓ రేంజ్ లో పోగుతున్నారు. ఈ పొగడ్తలు చూస్తుంటే 'కొన్ని సార్లు పట్టుకోవడం కంటే వదిలెయ్యడమే మంచింది అనే' సామెత గుర్తొస్తుంది.  



At last! The first Bluefin tuna to be caught, tagged and released on The South Coast of Ireland, 102 inches in length 😁

Image may contain: one or more people, water and outdoor
Image may contain: one or more people, water and outdoor

Tags: 23 crores worth fish tuna fish Ireland

Advertisement
Advertisement
Top