logo

లీజుకు తీసుకున్న భూమిలో విలువైన వజ్రం లభ్యం


29-Sep-2019 15:48IST
labour finds valuable diamond in a land taken for lease in madyapradesh

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో, ఓ సాధారణ కూలికి 4.33 క్యారెట్ల విలువైన వజ్రం లభ్యమైంది. సదరు వ్యక్తి మూడు నెలల పాటు లీజుకు తీసుకున్న భూమిలో వజ్రం లభించడంతో, అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఆ కూలీకి లభ్యమైన వజ్రం విలువ మార్కెట్‌లో పెద్దమొత్తంలో  పలుకవచ్చని తెలుస్తోంది. ఆ వజ్రాన్ని వేలం వేశాక వచ్చిన మొత్తాన్ని అతనికి అందజేయనునట్టు అధికారులు తెలిపారు.

పన్నా జిల్లాలోని షాహ్‌నగర్‌కు చెందిన వసంత్‌సింగ్ అనే కూలీ... సెప్టెంబరు 25న కల్యాణ్‌పూర్ ప్రాంతంలో 6 x 4 మీటర్ల భూమిని, రూ. 200 అద్దెకు లీజుకు తీసుకున్నాడు. ఈ భూ భాగంలో తవ్వకాలు జరిపేందుకు అతనికి మూడు నెలల వరకూ అనుమతి ఉంది. అయితే తవ్వకాలు ప్రారంభించిన రెండవ రోజునే అతనిని అదృష్టం వరించింది. తవ్వకాలు జరుపుతున్న సమయంలో అతనికి ఓ మెరుస్తున్న రాయి కనిపించడంతో... సింగ్ దానిని ఓ వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకెళ్లాడు. 

పరీక్షలు నిర్వహించిన అనంతరం అది 4.33 క్యారెట్ల వజ్రమని తేలింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్వరలోనే అధికారులు ఈ వజ్రానికి వేలం నిర్వహించి, వచ్చిన మొత్తంలో 11.5 శాతాన్ని ప్రభుత్వ రాయల్టీ కింద పట్టుకొని, మరో 2 శాతాన్ని ఇతర పన్నుల కింద మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసంసింగ్‌కు అందజేయనున్నారు.

Tags: madyapradesh 4.33 carats diamond lease land vasanth singh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top