logo

వాయుసేనకు నూతన అధిపతిగా ఆర్‌కేఎస్ భదౌరియా


30-Sep-2019 15:10IST
rks bhadauria as the new head of the air force

భారత వైమానిక దళానికి నూతన అదిపతిగా రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదూరియా నేడు బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రస్తతం ఆయన  26వ వైమానిక దళానికి చీఫ్‌ మార్షల్‌గా పనిచేసేందుకు సిద్దమయ్యాడు. ఇంతకు ముందున్నఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా నేటి పదవి విరమణ అనంతరం రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ పదవిని చేపట్టారు. ఈయన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, సదరన్ ఎయిర్ కమాండ్‌గా మార్చి 2017 నుంచి ఆగస్టు 2018 వరకు పనిచేశారు. 

తర్వాత శిక్షణా కమాండ్‌గా.. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా కూడా సేవలందించారు. అంతే కాకుండా 26 భిన్నమైన విమానాలను 4250 గంటల పాటు నడిపిన అనుభవం ఉంది. అలాగే రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన మొదటి భారత వైమానిక దళానికి ఈయన నాయకత్వం వహించడంతో పాటు జెట్‌ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోవడంలో భదౌరియా కీలకపాత్ర పోషించారు.


Tags: indian air force new chief rks bhadauria

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top