logo

సాగర్ లో పెరుగుతున్న వరద ఉద్దృతి


30-Sep-2019 16:39IST
growing flood in naarjuna dagar dam

గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలోని నీటి వరద నాగార్జునసాగర్ జలాశయంలోకి చేరుతుండడంతో వరద నీటి ఉద్దృతి భారీగా పెరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నేపద్యంలో శ్రీశైలం నుండి సాగర్‌కు పెరుగుతున్న  నీటి పారుదల కారణంగా అధికారులు 4గేట్లను 10అడుగుల మేరకు పైకి ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ సాగర్‌ ఇన్‌ఫ్లో 1.24 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్‌ పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు 311.74 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 


Image result for nagarjuna sagar gates open photos

Tags: growing flood naarjuna dagar dam srisailam

Advertisement
Advertisement
Top