logo

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి చుక్కెదురు


30-Sep-2019 18:37IST
inx media case chidambaram has shocked again

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలని చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించగా సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు చిదంబరానికి బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో చిదంబరం అరెస్టు అయిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణ తరువాత జ్యుడిషల్‌ కస్టడీ మీద ఆయన గత నెల నుంచి తీహార్ జైలులో ఉన్నారు.
Image result for inx media case,chidambaram,

Tags: inx media case chidambaram

Advertisement
Advertisement
Top