logo

ప్రపంచంలోనే వింతైన ఉద్యోగాలు ఇవేనా..?


30-Sep-2019 22:15IST
Is this the most strange job in the world

మన దేశంలో ప్రతి మనిషిని తన జీవనాధారానికి, కుటుంబాన్ని పోషించడానికి రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మనము రోజుకి 8గంటల పాటు ఎంతో కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తుంటాము. కానీ కొన్ని దేశాలలో మాత్రం సులభమైన ఉద్యోగాలు చేస్తూ కొన్ని వేల డాలర్లను సంపాదిస్తుంటారు. ఆ ఉద్యోగాలేంటో ఒక్క సారి చూద్దామా..!

అమెరికా: 

Related image
కిస్మస్ నెల వచ్చిందంటే చాలు అమెరికాలో ఉత్సవాలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. అంతే కాదు ఈ  పండగ సందర్బంగా చాలా మంది శాంటాక్లాజ్ కోసం చర్చీలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ తమ కోరికలు తీరాలంటూ రాసినా చాలా లేఖలు పంపిస్తారన్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చిన ఆ లేఖలను చదివి వాటికి జవాబులు రాస్తే ఒక్కో ఉత్తరానికి 10డాలర్ల చొప్పున సంపాదించవచ్చంట. ఇలాంటి ఉద్యోగాలు అమెరికా లాంటి దేశాల్లో భారీగా ఉంటాయంటా. 

నెట్ ఫ్లిక్ :
Image result for netflix


ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ రంగంలో ఎంతో ఆదరణను పొందిన నెట్ ఫ్లిక్ లో వచ్చే ప్రతి షోని వీక్షించి, ఆ షో కి సంభందించిన సారాంశాన్ని నాలుగైదు మాటల్లో వివరించడమే ఈ ఉద్యోగం ఇందుకు గాను నెట్ ఫ్లిక్ సంస్థ వారానికి 100డాలర్లకు పైగా జీతాన్ని ఇస్తుందంటా. 

కౌగిలింత: 

Image result for hug
ప్రతి మనిషి తను చేసే పని వల్లనో లేక ఏవేవో ఆలోచన వల్లనో పడే మానసిక ఇబ్బందిని ఒక్క కౌగిలింత మటుమాయం చేసేస్తోంది. కౌగిలింతతో ప్రతి మనిషి శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. అయితే అందరికి అన్ని సమయాలల్లో కౌగిలింత దొరకడం అసాధ్యం కాబట్టి అమెరికా, చైనా, పోర్ట్ లాండ్ వంటి దేశాల్లో డబ్బు తీసుకొని కౌగిలింతని ఇస్తారంటే. అంతే కాదండోయ్ ఇందుకు గాను అక్కడ కొన్ని సంస్థలను కూడా నిర్మించారంట. ఎవరికైన కౌగిలింత అవసరమయితే ఒక గంటకు 60డాలర్లు చెల్లించి ఆ యోగ్యాన్ని పొందవచ్చట. 

గోల్ఫ్ బాల్స్  :

Image result for golf balls in lakes 
దాదాపుగా గోల్ఫ్ కోర్టులు నదుల పక్కనో లేక సరస్సుల పక్కనో ఉంటాయి. గోల్ఫ్ ఆడే వారు బంతిని కొట్టినప్పుడు చాలా వరకు బాల్స్ నీళ్లల్లో పడుతుంటాయి. అలా నెలల్లో పడ్డ బంతులను వెతికి తీసుకు రావడమే ఈ ఉద్యోగం విధి. ఇందుకుగాను గోల్ఫ్ కోర్ట్ సంస్థలు ఈ ఉద్యోగులకు ఏడాదికి 33వేల డాలర్ల జీతాలను ఇస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి మరెన్నో తెలియని విచిత్రమైన ఉగ్యోగాల ప్రపంచ మంతటా ఉన్నాయి. 

Tags: best jobs of the world cool jobs crazy jobs weird jobs

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top