logo

ఇక వాట్సాప్ ఆ ఫోన్లలో పని చేయదట ..!


01-Oct-2019 11:13IST
whatsapp will not work in some phones

నేటి కాలంలో వాట్సప్‌ వాడకం అంతా ఇంతా కాదు... ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రించే వరకూ వాట్సప్‌ వాడుతూనే ఉంటారు. ఏ చిన్న సమాచారం చేరవేయాలన్న వాట్సప్‌  తప్పనిసరి అనే పరిస్థితిలో ఉంది సమాజం. కాగా వినియోగాదారులకి అనుగుణంగా వాట్సప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. అయితే కొత్తగా వాట్సప్ లో మారుతున్న టెక్నాలజీ కారణంగా పాత ఫోన్లల్లో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత ఐఓఎస్‌ వెర్షన్లు వాడుతున్న ఐఫోన్ యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోకపోతే వారికి వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.
Image result for whats
ఐఓఎస్‌ 8తో పనిచేసే యాపిల్‌ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ పనిచేయదని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఓఎస్ 9 కన్నా ఎక్కువ ఓఎస్ ఉపయోగిస్తేనే వారు వాట్సప్‌ సేవలను పొందవచ్చు. వీటితోపాటు ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌ వినియోగదారులకి కూడా వాట్సప్‌ సేవలు ఆగిపోనున్నాయి. వీటితో పాటు విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా 2019 డిసెంబర్ 31 తర్వాత వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.  

Tags: whatsapp ios

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top