logo

దీపావళి ఆఫర్ రూ.699కే జియో ఫోన్


01-Oct-2019 16:02IST
diwali offer Jio phone just es 699 only

ప్రస్తుతం ఇండియాలోని టెలికం రంగంలో విబిన్నమైన ఆఫర్లతో మొబైల్ ప్రొడక్ట్స్ ని ముందుకు తీసుకువస్తూ... తనదైన ముద్ర వేసుకొని శరవేగంగా ముందుకు దూసుకుపోతున్న ఏకైక సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థ నేడు మరో సంచలనాత్మక ఆఫర్ ని మన ముందుకు తీసుకు రానుంది. ఇప్పటికే  డేటా, కాల్స్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, టీవీ సేవల్ని అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన ఈ సంస్థ జియో అభిమానులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

దీపావళి కానుకగా..రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే జియో సంస్థ అందిస్తోంది. అంతే కాదండోయ్ ఎలాంటి మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేయకుండానే ఫోన్‌ను కొనుగోలు చెయ్యవచ్చని ఈ సంస్థ ప్రకటించింది.  ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ను కొన్నవారికి మొదటి 7 రీఛార్జీలపై అదనంగా రూ.99 విలువ చేసే మొబైల్ డేటాను జియో ఉచితంగా అందించనుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీఛార్జీల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పండుగ అనంతరం పాత రేట్లే అమలవుతాయని జియో స్పష్టం చేసింది.

Image result for diwali offer jio phones

Tags: jio offer Mukesh Ambani 4G jio phone Reliance jio

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top