logo

అన్నింటికీ భిన్నంగా మోటరోలా మడత ఫోన్


01-Oct-2019 17:56IST
motorola Razr mobile was very special

ప్రస్తుతం మన జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది కీలక పాత్రను పోషిస్తోంది. అంతే కాకుండా రోజు రోజుకి మార్కెట్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు భారీ స్థాయిలో ఉండడంతో తయారీ దారుల మధ్య భారీ పోటీలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల్లో ఇప్పుడొస్తున్న ట్రెండ్‌ అంతా కూడా మడిచే ఫోన్లే. ఇప్పటి వరకు మార్కెట్లోకి శామ్‌సంగ్‌, ఎల్జి, హ్యువావీలు ఈ విషయంలో ముందడుగు వేయగా.. ఇప్పుడు తాజాగా మోటోరోలా కూడా ఫోల్డబుల్‌ ఫోన్‌ తయారీలోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. 
motorola razr 2019 concept render
తన మోటో రేజర్‌ మోడల్‌నే మోటోరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌గా మార్చనున్నట్లు ఆ సంస్థ చెప్తోంది. ఇప్పటివరకూ వస్తున్న ఫోల్డబుల్‌ ఫోన్స్‌ తయారుచేస్తున్న కంపెనీలు ఫోల్డబుల్‌ ఫోన్‌ని మామూలు సైజ్‌లోనే ఉండేలా చూసుకుంటున్నాయి. కానీ ఈ మోటోరోలా ఫోన్లు అదే సైజ్‌లో కాకుండా  ఫోన్‌ని మడత పెట్టి మరింత చిన్నది చేసేందుకు ఫోల్డ్‌ ని వాడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైజ్‌ స్క్రీన్‌నే ఇస్తూ... ఫోన్‌ చిన్నగామారేందుకు ఈ మడత ఉపయోగపడుతుందన్నమాట. మరీ ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే కొత్త సంవత్సరానికి విడుదల కానున్నట్లు సమాచారం.

Tags: motorola Razr mobile technical

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top