logo

ఖాదీ స్టోర్లలో రేపటి నుండి వెదురు బాటిళ్ళ అమ్మకాలు


01-Oct-2019 18:43IST
bamboo bottles sales from tomorrow in khadi stores

రేపు జరగనున్న గాంధీ జయంతి సందర్బంగా.. ప్రస్తుతం మనం వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులకు సెలవు చెప్పాలంటూ కేంద్రం ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఒక్క సారి ఉపయోగించిన తరువాత చెత్తకుప్పలో పడేసే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్, స్ట్రాలు ఇంకా ఎన్నో రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను, వాటి వినియోగాన్ని నిలిపివేయాలంటూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నీటిని తాగేందుకు ఉపయోగినవే ప్లాస్టిక్ సీసాల బదులుగా వాటి స్థానాల్లో సమాంతరంగా ఉపయోగించేందుకు చిన్న తరహా పరిశ్రమలు శాఖ (MSME) కింద పనిచేసే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) వెదురు బాటిళ్లను తయారు చేస్తోంది.

ఈ సందర్బంగా పరిశ్రమల శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెదురు బొంగుతో తయారు చేసే ఈ సీసాల పరిశ్రమలను నేడు ప్రారంభించాడు. ప్రకృతిలో పెరిగే ఈ బొంగులతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. పైగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. 750 మిల్లీ లీటర్ల ఈ బాటిల్ ధర రూ.300. ఇట్టి ఖాదీ స్టోర్లలో వెదురు బాటిళ్ల అమ్మకాలు  రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. అంతే కాకుండా ప్లాస్టిక్ గ్లాసు స్థానంలో మట్టి గ్లాసులను, ఆవు పేడతో తయారు చేసిన సబ్బులు, షాంపూల వంటి ఉత్పత్తులను రేపటి నుండి ఖాదీ స్టోర్లలో లభ్యం కానున్నాయి. ఇలాంటి వాటితో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

బొంగు బాటిల్‌ను లాంచ్ చేసిన కేంద్రం.. బై బై ప్లాస్టిక్...

Tags: gandhi jayanthi bamboo bottles khadi stores

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top