logo

అమెరికా వలసలఫై ట్రంప్ వింత నిర్ణయం


02-Oct-2019 19:54IST
trumps strange decision to colonize america

పక్క దేశాలనుండి అమెరికాకు వచ్చే ప్రజల వలసల్ని ఆపేందుకు అమెరికాలో జరిగిన ఓ మీటింగ్ లో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇప్పటికే వలసల్ని ఆపే ప్రయత్నంగా సరిహద్దుల్లో ఇనుప కంచెను ఏర్పాటు చేసినప్పటికీ వలసలు ఆగడం లేదని ట్రంప్ ఓ వింత నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్‌లో ఎలక్ట్రిక్ తీగలు అమర్చి వాటిపై ముళ్లు ఏర్పాటు చేయాలని, అంతే కాకుండా దానికి కొద్ది దూరంలో నీటి కాలువ తవ్వి అందులో పాములు, మొసళ్లను ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు. వైట్‌హౌస్ అధికారులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాట్లాడుతూ..ఎవరైనా వలసదారులు కంచె దాటేందుకు ప్రయత్నిస్తే వారి కాళ్లను కాల్చేయాలని, కంచెపై మానవ మాంసపు వ్యర్థాల్ని ఏర్పాటు చేయాలని మండి పడుతూ వింత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కోపం కారణంగా అరగంట సేపు జరగాల్సిన మీటింగ్ 2 గంటలకు పైగా జరిగిందని సమాచారం. 



Related image

Tags: trump strange decision colonize america

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top