logo

వాట్సాప్ లో మీ మెసేజ్ 5సెకండ్స్ లో మాయం


02-Oct-2019 22:06IST
new feature coming soon in whatsapp

ప్రస్తుతం సోషల్ మీడియా రంగంలో అతి ఎక్కువ యూజర్స్ ని సొంతం చేసుకున్న ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్. ఈ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తూ అందరిని ఆకట్టుకోవడమే కాదు..అలావాటుగా కూడా మారిపోయింది. మొదట బీటా యూజర్లకు అప్‌డేట్స్ రిలీజ్ చేసి కొన్ని మార్పుచేర్పులతో అందరికీ కొత్త ఫీచర్స్‌ని అందిస్తుంది వాట్సప్. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందరిని అలరించబోతోంది. అంతే కాదు ఈ ఫీచర్ ఇంతకుముందు వచ్చిన వాటికన్నా భిన్నమైనది. మాములుగా మనం వాట్సప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపిస్తే డిలిట్ చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. 

కానీ... ఆ తర్వాత మెసేజ్‌ను డిలిట్ చేసే ఫీచర్ అందించింది వాట్సప్. ఇప్పుడు కొత్తగా 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.19.275 వర్షన్‌లో ఈ ఫీచర్ వాడుకోవచ్చు . వాట్సప్ 'డిసప్పియరింగ్ మెసేజెస్' ఫీచర్ యాక్టివేట్ చేస్తే మీరు పంపిన ఏ మెసేజ్‌నైనా జస్ట్ 5 సెకండ్లలో మాయం చేయొచ్చు. అంటే వాట్సప్ మెసేజ్ చేయగానే 5 సెకండ్లలో మాయమైపోతుందన్నమాట. దీన్ని 5 సెకండ్ల నుంచి 1 గంట వరకు పరిమితి టైమ్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ మెసేజ్ ఎంత సమయం కనిపించాలో మీరే నిర్ణయించొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సప్ గ్రూప్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలోనే అందరికి అందుబాటులోకి తేనున్నారు. 

Image result for disappearing messages in whatsapp









Image result for disappearing messages in whatsapp

Tags: disappearing messages feature coming soon whatsapp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top