logo

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కట్లు


03-Oct-2019 17:59IST
domestic stock markets ended with losses

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కట్లు, విదేశీ మార్కెట్ల మదుపరుల అప్రమత్తత వహించడం వల్ల సూచీలు కోలుకోక పోవడంతో నేడు స్టాక్‌మార్కట్లు నష్టాలతో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 198.54 పాయింట్ల న‌ష్టంతో 38,106.87 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 45.90 పాయింట్ల న‌ష్టంతో 11,314 వ‌ద్ద ట్రేడ్ అయ్యింది. చివర్లో కాస్త నష్టాలు తగ్గాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోగా నిఫ్టీ 11,300 దిగువ‌న న‌మోదైంది.    సెప్టెంబ‌ర్‌లో జీఎస్‌టీ వ‌సూళ్లు త‌గ్గ‌డం, ఆర్‌బీఐ స‌మీక్ష నిర్ణ‌యాల కోసం వేచిచూడటంతో పాటు అంత‌ర్జాతీయంగా వాణిజ్య యుద్ధ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు నేడు అప్ర‌మ‌త్త‌త వ‌హించారు. మ‌రోవైపు య‌స్ బ్యాంక్ షేర్లు మాత్రం నేటి ట్రేడింగ్‌లో 32 శాతం లాభ‌ప‌డ్డాయి. దీంతోపాటు మ‌రికొన్ని షేర్లు రాణించాయి. ఆసియా మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.70.92 వ‌ద్ద కొన‌సాగుతోంది.


Image result for stock market losses

Tags: domestic stock markets ended with losses

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top