logo

మృతదేహం కోసం గొడవకు దిగిన 7గురు భార్యలు


03-Oct-2019 19:40IST
7  wives who fight for the their husband dead body

హరిద్వార్ లో ఓ డ్రైవెర్ కి జరిగిన విచిత్ర సంఘటన స్థానికులనే కాదు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకెళితే..హరిద్వార్ బస్తీకి చెందిన పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా వృత్తిని కొనసాగిస్తూ జీవనాన్ని గడిపేవాడు. చాలీ చాలని జీతంతో ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటున్న పవన్ కుమార్ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇట్టి సంఘటనను గమనించిన స్థానికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో అతని మృతదేహాన్ని స్థానికులు తన ఇంటికి తరలించారు. ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలయ్యింది. పవన్ మృతదేహాన్ని చూసి భార్య ఏడుస్తు కూర్చున్న సమయంలో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. వచ్చింది స్థానికులు కాదండోయ్ చనిపోయిన పవన్ కుమార్ భార్యలు. ఆయన మా ఆయన అంటే..కాదు మా ఆయన అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. డెడ్ బాడీని తమకంటే తమకు అప్పగించాలంటూ గొడవకు దిగారు. ఈ చిత్రమైన సంఘటనను వీక్షిస్తున్న స్థానికులకు ఏమీ అర్థంకాక అలా చూస్తుండిపోయారు. ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న ఆ మహిళలు పోలీసుల రాకతో కాస్త తగ్గారు. వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక.. అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే..ఒక వ్యక్తి మృతదేహం కోసం ఏడుగురు మహిళలు ఆందోళనకు దిగడం.. తామందరం అతడి భార్యలమని చెప్పడంతో పోలీసులే కాదు స్థానికులు సైతం విస్మయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో వీడు చచ్చి బ్రతికాడురా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. 
   



Tags: 7 wives fight husband dead body

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top