logo

వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్


05-Oct-2019 08:05IST
ysr vahana mitra scheme started by ys jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏలూరులోని కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో సీఎం వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు ఏలూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కాగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు. ఇక వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో భాగంగా ఆటో, క్యాబ్‌ కలిగి వున్న ఆటోడ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. 
Image result for ysr vahana mitra scheme, ap cm ys jagan
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,75,531 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 13,062 మంది వ్యక్తులు  లబ్ధి పొందనున్నారు.  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ శుక్రవారం నుండే ఈ పథకం అమలుకానుండగా... ఇంకా అర్హులెవరైనా ఉంటే వారికి అక్టోబర్  30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.  ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని  హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అదే నగరంలో వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించడం విశేషం.

Tags: ysr vahana mitra scheme ap cm ys jagan

Advertisement
Advertisement
Top