logo

సరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు


05-Oct-2019 12:29IST
goddess kanaka durga as saraswathi devi

దసరా శరన్ననవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఏడో రోజున జగజ్జనని కనకదుర్గమ్మ "సరస్వతి దేవి" అలంకరణలో భక్తులకు దర్శనమిస్తొంది. శనివారం అమ్మవారు జన్మించిన దినం మూల నక్షత్రం అవటంతో అమ్మవారిని దర్శించుకుందుకు తెల్లవారు జామునుంచే వేలాదిగా తరలిరావటంతో క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.

కెనాల్ రోడ్డులోని వినాయకుడు గుడి వద్ద నుంచి ఇంద్రకీలాద్రిపై రాజగోపురం వరకు ఉన్నక్యూ మార్గంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. "సరస్వతి దేవి"అలంకరణలో ఉన్నఅమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు భక్తులకు దర్శన సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 
Related image

Tags: dussehra 2019 dussehra dussehra puja 2019 saraswati devi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top