logo

పుత్రికోత్సాహంలో అజింక్య రహానె


05-Oct-2019 17:01IST
teamindia test vice captain rahane becomes father

టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె శనివారం నాడు తండ్రయ్యాడు. రహానే సతీమణి రాధికా దోపవ్కార్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బరిలోకి దిగిన ఆయనకు ఈ శుభవార్త అందటంతో, ఆయన పుత్రికోత్సాహంతో పొంగిపోయారు. తన సహచరులతో ఈ విషయాన్ని పంచుకొని సంబరం చేసుకున్నారు. టీమిండియా సీనియర్‌ ఆటగాడు హర్భజన్‌సింగ్‌, ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపాడు.


'తొలిసారి తండ్రి అయిన రహానెకు అభినందనలు. తల్లీ పాప క్షేమంగా ఉన్నారనుకుంటా. అజ్జూ నీ జీవితంలో ఇప్పటి నుంచే ఫన్‌ మొదలవుతుంది' అంటూ పోస్టు చేశాడు. రహానె తన చిన్ననాటి స్నేహితురాలు రాధికని 2014లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ పాఠశాల స్థాయి నుంచే కలిసి పెరగడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా రహానె ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags: teamindia test vice captain rahane becomes father daughter radikha dopawarkar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top