logo

మహాత్మ గాంధీ అవార్డు అందుకున్న ఉపాసన


05-Oct-2019 17:50IST
upaasana konidela have got mahathma gandhi award

ఉపాసన..రామ్ చరణ్ సతీమణిగా,అపోలో వైస్ చైర్ పర్సన్ గానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో భాగసామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ ఉంటారనే విషయం అందరికి  తెలిసిందే. అంతే కాకుండా మంచి  ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ..సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య సూత్రాలను నలుగురికి చెబుతూ ప్రజలకు చేరువవుతున్నారు. అలాగే కాళీ సమయంలో నలుగురికి సాయం చేస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె సేవలను గుర్తించి అప్పట్లో  ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ కొణిదల ఇంటి కోడలు ఉపాసన మరో ప్రతిష్టాత్మక ఉత్తమ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ గాంధీ జయంతి సందర్బంగా.. ఉపాసన కొణిదల సేవలను గుర్తించిన ఓ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి సంస్థ వారు ఆమెకు మహాత్మ గాంధీ  పురస్కారాన్ని అందించింది. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా " మనల్ని మనం కనుగొనడానికి ఉత్తమమైన మార్గం ఎదుటి వారికి సాయం చెయ్యడమే" అంటూ తన మనసులోని మాటను అందరితో పంచుకున్నారు. అలాగే గాంధీ జయంతి నన్ను మా కుటుంబానికి ఎంతో ప్రోత్సాహించిందని, మహాత్మా గాంధీ అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.




Tags: upaasana konidela mahathma gandhi award corporate social responsibility

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top