logo

టీఎస్ఆర్టీసీలో 6 వేల నియామకాలు ..!


05-Oct-2019 19:03IST
6000 appointments in TSRTC

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు నేటి రాత్రి నుంచే సమ్మెకు దీక్ష పూనారు. ఈ క్రమంలో రాత్రి నుంచే బస్సులను నిలిపివేశారు. కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటల్లోగా విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇట్టి హెచ్చరికలను టీఎస్సార్టీసీ కార్మిక సంఘాలు ఖాతరు చేయలేదు. 

డెడ్ లైన్ ముగిసినా కార్మికుల నుంచి ఎటువంటి స్పందనా లేదు. దాంతో  తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగానే విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలిగించి ఆర్టీసీలో 6 వేల నియమించుకోవాలని భావిస్తోంది. 4 వేలమంది డ్రైవర్లు, 2 వేలమంది కండక్టర్లను నియమించుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేయనుంది. ఇందుకు గాను ఇప్పటికే ధరఖాస్తులను కూడ స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో సమ్మెఫై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం విధుల్లో చేరని కార్మికులను తొలగించేందుకు ఆలోచించమని స్పష్టం చేసింది.
Related image
    

Tags: 6 000 appointments tsrtc rtc strike

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top