logo

సిక్సర్ల రికార్డుని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ


05-Oct-2019 20:01IST
rohit sharma breaks record of sixes in test matches

టెస్ట్ మ్యాచుల్లో ప్రతి సారి ఆట గురించి విమర్శలను ఎదుర్కుంటూ వస్తున్న రోహిత్ శర్మ తన ప్రదర్శనతో అందరి నోళ్లను మూయిస్తాడనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం విశాఖలో సాగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా ఆటలో ప్రత్యర్థి బౌలింగ్ సులభ తరం కావడంతో ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ సెంచరీలు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో 127 రన్స్ చేశాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్లో ఐదో శతకం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. 

ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ గా రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ఇంతకు ముందూ వసీం అక్రం 1996లో ఒక టెస్టులో కొట్టిన 12 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. 2015లో అజింక్య రహానే తర్వాత భారత్ నుంచి ఒక ఆటగాడు ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటిసారి. అయితే, రోహిత్ శర్మ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గావస్కర్(మూడు సార్లు), రాహుల్ ద్రవిడ్(రెండు సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఈ ఫీట్ చేశారు. ముఖ్యంగా సునీల్ గావస్కర్ తర్వాత ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేసిన ఘనత సాధించిన ఒకే ఒక భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ.


Tags: india - southafrica rohith sharma double centuries 13 sixes

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top