logo

టీ20ల్లో పిన్నవయస్సులో హ్యాట్రిక్ సాధించిన పాక్ బౌలర్


06-Oct-2019 10:40IST
mohammed hasnan as youngest player to hold t20 hattrick

శనివారం లాహోర్‌ వేదికగా పాక్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌ జట్టుకు చెందిన పందొమ్మిదేళ్ల యువకుడు మహ్మద్‌ హస్నేన్‌, తను ఆడిన రెండో టీ20లోనే హ్యాట్రిక్‌ సాధించి, ప్రపంచ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల 183 రోజుల్లోనే ఈ ఫీట్ ను సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు పుటల్లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్‌ సాధించగా, పాక్‌ యువ బౌలర్‌ మహ్మద్‌ నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
తొలిరెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మహ్మద్, తన స్పెల్ లోని మూడో ఓవర్ చివరి బంతికి రాజపక్ష(32)ను ఔట్‌ చేశాడు. అనంతరం 4వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు షనక(17), శెహన్‌ జయసూర్య(2)లను పెవిలియన్‌ చేర్చడంతో టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. కాగా, లక్ష్య ఛేదనలో పాక్‌  కేవలం 101 పరుగులకే కుప్పకూలడంతో, పర్యాటక జట్టు... తొలి మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యం సంపాదించింది.

Tags: mohammed hasnan t20 hattrick youngest player pakistan vs srilanka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top