logo

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే ఉపయోగాలు..


06-Oct-2019 11:10IST
butter milk health benifits

బగబగ మండే భానుడి ప్రతాపానికి జనాలు భయపడుతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే వేడి దెబ్బకు తల్లడిల్లిపోతున్నారు. అయితే ఈ వేసవి తాపాన్ని తగ్గించడానికి మనకందుబాటులో ఉండే చాలా చిట్కాలను పాటించొచ్చు. వాటిల్లో ముఖ్యంగా చల్లని ఆహారపదార్దాలను తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తే చాలు, కొంతవరకు మిమ్మల్ని మీరు చల్లబరుచుకోవచ్చు.

మరీ ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గించడానికి మజ్జిగను తీసుకుంటే .. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక వేసవికాలంలో మజ్జిగను సేవించడం వలన కలిగే లాభాలేంటో చూద్దాం..

1) వేసవిలో మన శరీరం చాలా వేడిగా అనిపిస్తుంటుంది. ఈ సమయంలో మజ్జిగను తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. అలాగే వడదెబ్బ తగులకుండా.. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.

2) ముఖ్యంగా అజీర్ణ సమస్యలు ఉన్నవారు మజ్జిగను తీసుకోవడం తప్పనిసరి. అలాగే రక్తసరఫరా కూడా చక్కగా మెరుగుపడుతుంది.

3) అలాగే వేసవిలో మజ్జిగను తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడమే కాకుండా .. చర్మ సౌందర్యం రెట్టింపవుతుంది.

4) ఎండవలన చర్మం పొడిబారిపోతుంటుంది. అలాంటప్పుడు మజ్జిగలో కొంచెం తేనె కలిపి చర్మంపై పూత లా రాసి.. స్నానం చేస్తే చర్మం చాలా మృదువుగా తయారవుతుంది.

5) మరీ ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం సమస్యలు ఉన్నవారు మజ్జిగలో జీలకర్ర పొడిని వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

చూసారుగా మజ్జిగ తో ఎన్ని ప్రయోజనాలున్నాయో? చిన్నవారికైనా అలాగే పెద్దవారికైనా ఇది సంజీవనిలా పనిచేస్తుంది. కాబట్టి కూల్ డ్రింకులు, జ్యూస్ లు ఇలాంటి వాటి కంటే.. ఇంట్లోనే తయారుచేసుకునే మజ్జిగకు ప్రాధాన్యత ఇవ్వండి.

Image result for buttermilk

Tags: butter milk health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top