logo

తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం


06-Oct-2019 14:18IST
india wins in first test against south africa

విశాఖ వేదికగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 395 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ప్రొటీస్ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సొంతం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

భారత బౌలర్లు మహమ్మద్ షమీ 5వికెట్లు సాధించగా, జడేజా 4, అశ్విన్ ఒక వికెట్ ను పడగొట్టారు. దక్షిణాఫ్రికా వంద పరుగుల లోపే చాపచుట్టేస్తుందని అనుకున్నప్పటికీ టెయిల్ఎండర్లు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన అశ్విన్ కు 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.    

Tags: teamindia victory first test vs south africa vizag

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top