logo

ఒక్క క్లిక్ తో మీ వాట్సాప్ డేటా స్వాహా..?


06-Oct-2019 19:37IST
your whatsapp haked with one clik malware bug

రోజుకొక కొత్త రంగుని పూలుముకుంటున్న టెక్నాలజీలో వాట్సాప్ తనదైన శైలిలో కొత్త ఫీచర్స్ ని అందిస్తూ సామాజిక మాధ్యమ రంగంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు చేస్తూ..వాట్సప్‌ను మరింత సౌకర్యవంతంగా వాడుకునేందుకు సరికొత్త ఫీచర్లను అప్డేట్స్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్న క్రమంలో అనూహ్యంగా ఓ కొత్త సమస్య ఏర్పడింది. అదేంటి అని ఆశ్చర్య పోతున్నారా..? అవునండి మనం నిమిషం వదలకుండా వాడుతున్న వాట్సాప్‌లో మాల్‌వేర్ బగ్ ప్రవేశించింది. ఇక ఈ బగ్ వల్ల అనేక రకాల సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మన వాట్సాప్ అకౌంట్లలో షేర్ చేసుకుంటున్న పర్సనల్ డేటాకు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్ సెల్ హెచ్చరిస్తోందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు పొంచి ఉన్న మరో కొత్త సమస్య మన విలువైన డేటాను హ్యాకర్లు చోరీ చేస్తారనే విషయం యూజర్లకు తలనొప్పిగా మారనుందనే చెప్పుకోవాలి. కావునా, బగ్ ఇష్యూ ఫిక్స్ అయ్యేవరకు ఎటువంటి అనుమానాస్పదమైన, ఫేక్ న్యూస్ లింకులను షేర్ చేయొద్దని సైబర్ సెల్ అధికారులు యూజర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు వాట్సాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న తర్వాత జిఫ్‌లను షేర్ చేయాలని సూచించారు. వాట్సాప్ వెర్షన్ 2.19.244 లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెర్షన్ వాడే యూజర్లను వెంటనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. 


Image result for whatsapp malware bug

Tags: whatsapp hacked malware bug

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top