logo

మహిషాసురమర్ధనిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ


07-Oct-2019 15:21IST
durgamma as mahishuramardhani in vijayawada

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు సోమవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి మహిషాసురమర్ధనిగా దర్శనమిచ్చింది. దుర్గాదేవి ...నాలుగు భుజాలతో సింహవాహనాన్ని అధిరోహించి, రౌద్రంగా భక్తులకు దర్శనమిచ్చింది. ఇక అమ్మవారు దక్షిణ హస్తంలో చక్రం, పైన చేతిలో గద, ఎడమ వైపు కింది చేతిలో శంఖం ,పై చేతిలో కమలముతో ఉగ్రరూపంతో కనిపించింది. దుర్గా దేవీ నవ రూపాలలో అమ్మవారి ఈ రూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 

Image result for మహిషాసురమర్ధిని గా దర్శనమిచ్చిన దుర్గమ్మ

దేవతలందరి శక్తులు ఈమెలో ఉంటాయి. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని చెబుతున్నాయి. మహిళల్ని చిన్నచూపు చూడటం, వారిని విలాసవస్తువుగా భావించటం మొదలైన లక్షణాలకు మహిషుడు ఉదాహరణ. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉంటూనే వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలనే సందేశాన్ని మహిషాసుర మర్దనీదేవి అలంకారం మనకు అందిస్తుంది.

Tags: durgamma mahishuramardhani vijayawada

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top