logo

సునీల్ శెట్టి అల్లుడు కాబోతున్న క్రికెటర్ రాహుల్...?


07-Oct-2019 15:35IST
teamindia cricketer rahul going to marry sunil shetty daughter athiya shetty

టీమిండియా యువ క్రికెటర్ కే లోకేష్ రాహుల్, ప్రియురాళ్ల సంఖ్య చాంతాడంతగా మారింది. తరుచూ గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చే రాహుల్... తాజాగా బాలీవుడ్‌ కండలవీరుడు సునీల్ శెట్టి, గారాల పట్టి అతియా శెట్టితో డేటింగ్ చేస్తునట్టు తెలుస్తోంది. టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడపడం ఈ మధ్యకాలంలో గమనిస్తూనే ఉన్నాం. అయితే, అవి లాంగ్ టైం రిలేషన్ గా ఉండట్లేదు. అందులోను రాహుల్ లాంటి యువ క్రికెటర్లయితే తమ గర్ల్ ఫ్రెండ్స్ ను ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. 
గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చే విషయంలో తరుచూ వార్తల్లో నిలిచే రాహుల్, ప్రస్తుతం అతియా శెట్టితో డీప్ లవ్ లో ఉన్నట్టు సమాచారం. త్వరలో వారిద్దరూ ఒక్కటవ్వబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి అతియా తండ్రి సునీల్ శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో సునీల్ శెట్టి వీరి పెళ్లి విషయాన్ని ద్రువీకరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రకటన అనంతరం వారిరువురు కలిసి సన్నిహితంగా దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మొత్తానికి టీమిండియా మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట ...!

Tags: kl rahul athiya shetty marriage sunil shetty daughter

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top