logo

ఆ వాచ్ విలువ కోటిన్నర పైమాటే...!


07-Oct-2019 17:03IST
hardiks watch cost around 15 crores1

టీమిండియా సంచలన అల్ రౌండర్ హార్దిక్ పాండ్య, వెన్ను దిగువ భాగంలో గాయం కారణంగా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. కాగా, బీసీసీఐ అతడిని బ్రిటన్‌కు పంపి శస్త్రచికిత్స చేయింది. చికిత్స కూడా విజయవంతం కావడంతో అతను త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నారు. కాగా, శస్త్రచికిత్స అనంతరం, పాండ్య ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పాండ్య ఆస్పత్రి పడక మీద ఉన్న ఆ చిత్రంలో తన చేతికి ఓ గడియారం ధరించాడు. దాని విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. 
దాదాపు కోటిన్నర విలువ చేసే ఆ చేతి గడియారం ఫై, సోషల్‌ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పాటెక్‌ ఫిలిఫ్‌ నాటిలస్‌ శ్రేణికి చెందిన ఆ గడియారానికి మార్కెట్ లో మంచి డిమాండ్‌ ఉంది. ఒకప్పుడు పేదరికంలో మగ్గిన హార్దిక్ పాండ్య, ప్రస్తుతం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండటంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. కొందరు సెలెబ్రిటీలు, ఈ ఫోటో ను ట్యాగ్ చేస్తూ... తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా వ్యక్తపరిచారు. 

Tags: hardik pandya surgery photo patak phillip natilus watch

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top