logo

తిరుమలలో అంగరంగ వైభవంగా రథోత్సవం


08-Oct-2019 10:18IST
tirumala rathotsavam

తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీ వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంత్యంత వైభవంగా జరిగింది. భారీ  సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  
Image result for tirumala rathotsavam
సోమవారం రాత్రి అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. సోమవారం రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామివారి కి జరిగే ఉత్సవాలు ముగుస్తాయి. 

Tags: tirumala rathotsavam

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top