logo

ధనియాలు వలన ఇన్ని లాభాలా !!


08-Oct-2019 12:06IST
coriyandar health benifits

మనం ఇంట్లో ఉపయోగించే ధనియాలలో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదలరు. ఒక మనిషి సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం ఉంటే చాలు. అయితే మన ఆరోగ్యం సరిగా లేకపోతే మనదగ్గర ఎంత డబ్బు ఉన్నా దాన్ని అనుభవించలేము. అయితే మన శరీరంలోని ఎక్కువ శాతం జబ్బులను నయం చేయగల శక్తి ఒక్క ధనియాలుకు మాత్రమే ఉంది. పూర్వం రోజుల్లో ఈ ధనియాలును సర్వరోగ నివారిణి అని పిలిచేవారట. అయితే ఈ రోజుల్లో ఎక్కువమంది మాత్రం ధనియాలు తినడం లేదు. ఏదో ఇంట్లో చికెనో, మటన్ నో తెచ్చినప్పుడో మాత్రమే కొద్దిగా ఉపయోగిస్తున్నారు. ఇక మిగతా సమయాల్లో ఉపయోగించట్లేదు. అందుకే ఈ ధనియాలు విశిష్టత, వీటిని తినడం వలన మనకు కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మీ శరీరంలోని ఫ్యాట్ ను కరిగించే శక్తి ధనియాలులో ఉంది. ధనియాలును మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే అంతే బాడీలోని ఫ్యాట్ మొత్తం అట్టే కరిగిపోతుంది.
మీలోని లైంగిక శక్తిని కూడాధనియాలును రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా పెరుగుతుందట.
ధనియాలును చలికాలంలో మాత్రం తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ ధనియాలు వలన మన శరీరంలోని వేడిని బయటకు తీసివేస్తుందట తద్వారా మీరు ఎక్కువ చలిని తట్టుకోలేక ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. అయితే మీకు బాగా వేడి చేసింది అనిపిస్తే వెంటనే ధనియాల కాషాయం తాగండి.
మీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెపొందించుకోవాలన్న ఈ ధనియాలును రోజూ తీసుకోవాలట.
మీకు మంచి నిద్ర పట్టాలన్న ఈ ధనియాలును తీసుకుంటే చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు.

అదండీ, ధనియాలు వలన మనకు జరిగే మేలు. కాబట్టి వారంలో నాలుగు రోజులైనా ఈ ధనియాలు ఏవిధంగానైనా తీసుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు.

Image result for coriander
Image result for coriander

Tags: coriyandar health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top