logo

లారీ చోరీ కేసును చేధించిన పోలీసులు


08-Oct-2019 15:26IST
The cops who lobbied the lorry Chori case

ఇంటి ముందు ఉంచిన లారీని చోరీ చేసి టైర్లు, బ్యాటరీలను దోచుకెళ్లిన కేసును సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పోలీసులు చేధించారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాలు ప్రకారం,  కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 20వ తేది రాత్రి, యజమాని లారీని తన ఇంటి ఎదుట నిలిపి ఉంచగా, గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని, అనంతరం జిల్లాలోని చిన్నకోడూరు గ్రామ పరిసరాలలో లారీని దాచి, అందులో నుండి 15 టైర్లు, 2 బ్యాటరీలను ఎత్తుకెళ్లారని వివరించారు. తర్వాత కాల్ డిటైల్ రికార్డు ఆదారంగా మధ్యప్రదేశ్ కు చెందిన ఇతర లారీ నిర్వహకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. దొంగిలించిన టైర్లు, బ్యాటరీలు, నేరస్థులను మంగళ వారం ఉదయం, శనిగరం క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వివరించారు. అనంతరం వారిని కోర్టు ముందు హాజరు పరిచామని, మరో నలుగురు నేరస్థుల్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ మీడియాకు వివరించారు.
Image result for lorry chori

Tags: telangana siddipet

Advertisement
Advertisement
Top