logo

మందులు వాడితే మగపిల్లలు పుడతారా..?


08-Oct-2019 15:56IST
are medicines helpfull for male birth

తల్లి గర్భంలో ఉండేది ఆడబిడ్డా లేదా మగబిడ్డా అని తెలుసుకునే పరిజ్ఞానం మనకు అందుబాటులో ఉంది. అలాగని పుట్టబోయే బిడ్డ మగ లేక ఆడ అని నిర్ణయించే శక్తి మాత్రం ఎవరికీ లేదు. అయితే కొందరు వైద్యులు మాత్రం, వారు సూచించిన మందులు వాడితే మగపిల్లలు పుడతారని అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు. వారు చెబుతున్నట్టు ‘వై’ క్రోమోజోములను పెంచి, మగబిడ్డ పుట్టేలా చేసే మందులు అంటూ ప్రత్యేకంగా ఏవీ లేవు, ఉండవు కూడా! మీ బలహీనతను ఆసరాగా తీసుకుని కొందరు వైద్యులు మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విషయం గ్రహించండి. 
వారు మీకు సూచించిన మందులూ, వాటి వాడకం గురించి రహస్యంగా ఉంచమని మిమ్మల్ని కోరుతుంటారు. దానికి కారణం మీరెక్కడ విషయాన్ని బహిర్గతం చేస్తారో అన్న భయం. ఖరీదైన మందుల పేరుతో మీ దగ్గర వేలకొద్దీ డబ్బు గుంజడం తప్పించి వాటి వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదు, పైపెచ్చు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే, ఇలాంటి అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని మనవి. పుట్టే బిడ్డ మగా, ఆడ అన్న తేడా లేకుండా పెంచడం వరకే మన బాధ్యత అని గ్రహించండి.

Tags: medicines male birth

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top