logo

రోజూ బెండకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉన్నట్టే...!


08-Oct-2019 16:00IST
ladys finger has nature of controlling diabeties

షుగర్ వ్యాధి నియంత్రణకు బెండ ఓ దివ్యౌషదంలా పనిచేస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనిలో ఉండే పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగించటంతో పాటు  రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, వాటిని నిలకడగా ఉంచగలుగుతుందని వారు అంటున్నారు. టైప్‌ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలేయం వద్ద కొవ్వు కరిగించి,  జీవక్రియను మెరుగుపరిచే శక్తి బెండకాయలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బెండకాయను కూరలానో, లేక వేపుడు లానో తీసుకునే దానికంటే, తరిగిన బెండ ముక్కలతో చేసిన జ్యూస్‌ను తాగితే మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వారు తెలిపారు. అలాగే బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయని వారంటున్నారు. వాటిలో కొన్ని ఉపయోగాలను చూద్దాం. 
* బెండకాయ నీరు పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి.అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. 
* బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.
* గుండె పదిలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బెండకాయల్ని నానబెట్టిన నీరు ఎంతో మేలు చేస్తుంది.
* కంటిచూపు సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. స్కిన్, హెయిర్‌కి కూడా ఈ నీరు ప్రయోజనాలు కలిగిస్తుంది.
* అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి దీనికి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.

Tags: ladys finger contols diabeties fibre suger levels

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top