logo

గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన అంపైర్


08-Oct-2019 21:42IST
pakistan empire died in field due to heart attack

పాకిస్థాన్‌ లోని ఓ క్లబ్ స్థాయి మ్యాచ్ కు అంపైర్ గా వ్యవహరిస్తున్న నసీం షేక్, మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో కుప్పకూలి మృతి చెందాడు. దీంతో పాకిస్తాన్  క్రికెట్‌ వర్గాల్లో విషాదం నెలకొంది. కరాచీలోని టీఎంసీ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో నసీం అంపైర్ గా విధులు నిర్వహిస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే ఆ అంపైర్‌ ప్రాణాలు విడిచాడు. 

ఓ చిరువ్యాపారిగా ఉన్న నసీమ్‌ క్రికెట్‌ పై ఆపేక్షతో అంపైర్‌ స్థాయికి ఎదిగాడు. పాకిస్తాన్ క్రికెట్‌ వర్గాల్లో మంచి అంపైర్‌ గా గుర్తింపు తెచ్చుకున్న 56 ఏళ్ల నసీం షేక్, మైదానంలోనే తనువూ చాలించడం అందరినీ కలచివేసింది. కాగా, నసీమ్‌ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నట్టు, అందులో భాగంగా ఏంజియోగ్రామ్‌ ఆపరేషన్‌ కూడ జరిగినట్టు తెలుస్తోంది. నసీం మృతిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సంతాపం తెలిపింది. 

Tags: pakistan empire naseem shaik karachi club match heart attack died in field

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top