logo

రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే కొత్తిమీర రైస్


08-Oct-2019 21:47IST
cilantro rice gives taste aswell as good health

వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్, ఆలు రైస్, పుదీనా రైస్...ఇలా చాలా వెరైటీ రైస్ లను మనం రుచి చూసి ఉంటాము. కానీ, కొత్తిమీర రైస్ మాత్రం వాటన్నిటిలో ప్రత్యేకం. ఎందుకంటే కొత్తిమీర రైస్ రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. సాధారణంగా కొత్తిమీరను మంచి రుచి కోసమో లేక గార్నిషింగ్ కోసమో ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటిది ఈ కొత్తిమీరతో, ఓ ప్రత్యేకమైన వంటకాన్నే చేయొచ్చు. అదేంటో, దాని తయారీ విధానమేమిటో చూద్దాం. 

కొత్తిమీరతో చేసే అంత పెద్ద రెసిపీ ఏమిటి అని అనుకుంటున్నారా? ఎంతో సులువుగా, చాల తక్కువ సమయములో రెడీ అయిపోయే "కొత్తిమీర రైస్" ను ఎలా తయారు చేయాలి, అసలు కొత్తిమీరను వంటలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా..
కావలసిన పదార్దాలు:
1) కొత్తిమీర ఒక కట్ట(పెద్దది)
2) పచ్చిమిర్చి (7-8 కాయలు)
3)ఉల్లిపాయ (1 పెద్దది)
4) అల్లం వెల్లులి పేస్ట్ (తగినంత)
5) నెయ్యి (తగినంత)
6) జీడిపప్పులు ( ఆప్షనల్)

తయారీ విధానం :
ముందుగా కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి, తరువాత పచ్చిమిర్చి రెండుగా తుంపి పక్కన పెట్టుకోవాలి .. ఉల్లిపాయను కూడా 4ముక్కలుగా చేసుకోవాలి ... ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం శుభ్రపరచుకున్న కొత్తిమీరను, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి పేస్ట్ చేయాలి. స్టవ్ ఫై కడాయిలో నెయ్యిని వేసి, అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ను వేసి, ఒక నిముషం తరువాత అల్లం వెల్లులి పేస్ట్ ఒక స్పూన్ వేయాలి, స్టవ్ సిమ్ లో ఉంచుకుని 20నిముషాల పాటు దీనిని వేయించాల్సి ఉంటుంది, ఈ మిశ్రమం ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చాక సరిపడా ఉప్పుని వేసి, వేడి వేడి అన్నంలో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ...  

 కొత్తిమీర తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

* విటమిన్ ఏ, సి, ఇ, కే లు  పుష్కలంగా లభిస్తాయి.
* షుగర్ వ్యాధితో భాధపడేవారు కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
* కొత్తిమీర తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ సమస్యలు పోయి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
* తరచుగా తీసుకోవడం వలన కంటి సమస్యలు, నోటి పూత నుండి బయటపడచ్చు.    

Tags: cilantro rice good for health controlls diabetes tasty food

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top