logo

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం 'టీఆర్ఎస్'దే


09-Oct-2019 11:44IST
trs will win in huzur nagar by elections

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కారు పార్టీనే విజయం వరిస్తుందని టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి  స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం వేసిన రహదారికి మరమ్మతులు చేసి తానే రోడ్డు వేశానని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నెముక లేదని ఆయన విమర్శించారు. కేవలం ఢిల్లీ పాలకులకు సంచులు మోసి పదువులు సంపాదిస్తారని ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తామని ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. 

Image result for trs will win in huzurnagar by elections

Read latest Telangana News and Online Telugu News
 | Follow us on FaceBook, Twitter

Tags: huzurnagar huzurnagar by election sanampudi saidireddy trs trs candidate cm kcr

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top