logo

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరుగనున్నాయి...


09-Oct-2019 15:15IST
salaries to be hiked for central government emloyees on diwali occasion

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా, జీతాలు పెంచనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 5 శాతం డీఏ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతాలు ఈ ఏడాది జూలై నుంచే అమల్లోకి రానున్నాయి. గతంలో ప్రకటించిన 12 శాతం డీఏను 17 శాతానికి పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు, మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలకు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. దీని కారణంగా ప్రభుత్వ ఖాజానా పై రూ.16,000 లక్షల అదనపు భారం పడనుంది. వీరితో పాటు కేంద్ర పరిధిలో ఉన్న ఆశా వర్కర్లకు ఇచ్చే వేతనాన్ని కూడా రెట్టింపు చేయనున్నట్టు మంత్రి జవదేకర్ ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter 

Tags: central government empoloyees pensioners DA increase 5% central minister javadekar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top