logo

ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలో రాష్ట్ర బంద్...


09-Oct-2019 16:16IST
call for state bandh if demands not resolved

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో... రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలిపునిస్తామని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని ఆయన హెచ్చరించారు. నేడు ఉదయం ప్రెస్ క్లబ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను ఎండగట్టారు. చట్టబద్దంగా, శాంతియుతంగా తాము సమ్మె చేస్తుంటే, తమను విధుల నుంచి తొలగించామని ముఖ్యమంత్రి ప్రకటించడం ఆయన నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆయన అన్నారు.   

ఈ సందర్బంగా, ఆయన ఉద్యోగ సంఘాలు మద్దతును కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి పోరాటం చేశాయని... ఆ స్ఫూర్తితోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామని అన్నారు. ఉద్యోగ సంఘాలను ఏమైనా నొప్పించినట్టు మాట్లాడితే క్షమించి... తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో అఖిలపక్షం, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని అయన ప్రకటించారు.

Tags: tsrtc state bandh demands JAC convener aswaddama reddy TJAC

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top