logo

'ఎంఎంఓఎఫ్‌' సినిమా టీజర్ విడుదల..


09-Oct-2019 16:19IST
mmof movie teaser release

టాలీవుడ్ లో ప్రతి నాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారిన హీరో జెడి చక్రవర్తి. స్టార్ హీరోల సినిమాలలో అప్పుడప్పుడు దర్శనమిస్తున్న జెడి ఒక ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్ ఎస్సీ దర్శకత్వంలో జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎంఎంఓఎఫ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రొడక్షన్స్‌, జేకే క్రియేషన్స్‌ పతాకంపై రాజా, రాజశేఖర్‌, జేడీ ఖాసింలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల నుండి విశేష స్పందన అందుకుంటుంది. ఇక టీజర్ విషయానికొస్తే ఒక థియేటర్ ఓనర్ దీపక్. 

Image result for ఎంఎంఓఎఫ్‌

అతని థియేటర్ కి వచ్చినా వారిలో కొందరు హత్యకు గురవుతారు. రోజుకొకరు చొప్పున చనిపోవడంతో ఆ థియేటర్ కి రావడానికి ప్రజలు భయపడుతుంటారు. అసలు ఆ థియేటర్ లో హత్యలు చేసిందెవరు ? ఎందుకు చేసారు ? ఆ సినిమా హాలులో ఏమన్నా దెయ్యం ఉందా ? అనే ట్విస్టులను చూపిస్తూ సాగిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సస్పెన్స్ క్రైమ్ డ్రామా  గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షుకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో జెడి  హిట్ కొడతాడేమో చూడాలి.

Tags: mmof movie teaser jd chakravarty

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top