logo

కడపలో దసరా వేడుకల్లో అపశ్రుతి


09-Oct-2019 16:23IST
tragedy dasara celbrations

కడపలోని దసరా వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి ఊరేగింపు వేడుకలో కాల్చిన బాణాసంచా కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళితే కడప జిల్లాలో గోకుల్ లాడ్జ్ వద్ద నుండి అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో భాగంగా యువకులు బాణాసంచా కాల్చారు. అయితే  బాణాసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న ఒక టీవీ షోరూం లో పడి అగ్ని ప్రమాదం సంభవించింది. 
ఈ అగ్ని ప్రమాదంలో రూ. 50 లక్షల విలువ చేసే టీవీలు, ఫ్రిజ్‌లు దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సంచారమే అందించారు. సమాచారం అనుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమానులు తెలిపారు. ఈ ఘటనపై కేసీ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags: dasara celbrations kadapa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top