logo

హైదరాబాద్ లో భారీ పిడుగుపడి ఇల్లు ధ్వంసం


09-Oct-2019 16:27IST
huge thunderbolt house destroyed in hyderabad

హైదరాబాద్ లో మంగళవారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షానికి భారీ పిడుగుపడి ఓ ఇల్లు ధ్వసమైంది. చాదర్‌ ఘాట్‌ లోని ఓల్డ్‌ మలక్‌ పేట్‌ రేస్‌ కోర్స్‌ సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దానికి ఇంటిలోని వారు పరుగులు తీశారు. పిడుగు దాటికి ఇంటిపై కప్పు, గోడలు బీటలు పారాయి. గోడల నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. 
Related image
దీంతో ఇంట్లోని వారే కాకుండా చుట్టుపక్కలున్న వారందరు భయబ్రాంతులకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం క్యూములోనింబస్‌ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసిన విషయం తెలిసిందే. గంట పాటు కురిసిన భారీవర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. ఇక రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

Read latest Telangana News and Online Telugu News | Follow us on FaceBookTwitter

Tags: huge thunderbolt house hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top